సోమవారం, 12 జనవరి 2026
Candidate Name బాబూ మోహన్
State Telangana
Party BJP
Constituency Andole
Candidate Current Position Senior actor, Former Minister

బాబు మోహన్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడుగా గుర్తింపు పొందిన బాబు మోహన్.. కేవలం సినిమా నటుడుగానే కాకుండా ఒక రాజకీయ నేతగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితం. మాయలోడు చిత్రంతో హాస్య నటుడుగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన 1952 మార్చి 19న బీరోలు, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లాలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశారు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించారు. 
 
రాజకీయ నేపథ్యం : బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ముందు తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 దాకా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు. 2018 నుంచి బీజేపీలో ఉన్నారు. బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా ఆంథోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందాడు. 2019లో బీజేపీలో చేరి ఆంథోల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే‌గా పోటి చేసి ఓడిపోగా, ఇపుడు మరోమారు అదే స్థానం నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

Election Schedule
States No of Seats Date of Poll
Bihar 243 Nov, 06, 2025