శుక్రవారం, 8 నవంబరు 2024
Candidate Name బాల్క సుమన్
State Telangana
Party BRS
Constituency Chennur
Candidate Current Position MLA

ప్రస్తుత 16వ లోక్‌సభలో సభ్యుడిగా ఉన్న బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇపుడు చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. గత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా ఈయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు రెండోసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 1983 అక్టోబరు 18వ తేదీన కరీంనగర్ జిల్లాలోన రేగుంట గ్రామంలో జన్మించిన బాల్క సుమన్... 16వ లోక్‌సభకు పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 
 
ఈయన తండ్రి బాల్క సురేష్ కూడా భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన కీలక భూమికను పోషించారు. ప్రస్తుతం మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన తల్లి గృహిణిగా కొనసాగుతున్నారు. టీవీ జర్నలిస్ట్ రాణి అలేఖ్యను 2013లో వివాహం చేసుకోగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
మెట్‌పల్లిలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన బాల్క సుమన్.. 5 నుంచి 9వ తరగతి వరకు జగిత్యాల్ జిల్లాలోని పెంబట్లలో చదివారు. కోరుట్లలోని ప్రభుత్వం డిగ్రీ కాలేజీలో బీఏ (హెచ్ఈవీ) పూర్తి చేసిన ఆయన.. 2003లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టి, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2004లో ఎంఫిల్ లింగ్విస్టిక్ పూర్తి చేశారు. 2008 పీహెచ్‌డీ కోసం తన పేరును నమోదు చేసుకుని 2018లో దాన్ని పూర్తి చేసి, గౌరవ డాక్టరేట్ డిగ్రీని పొందారు. 
 
2001 నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బాల్క సుమన్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. 2007లో బీఆర్ఎస్‌వీ విద్యార్థి సంఘ నేతగా కొనసాగారు. ఆ తర్వాత ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా 2010లో ఎంపికయ్యారు. ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. 

Election Schedule
States No of Seats Date of Poll
Jharkhand 81 Nov, 20, 2024
Maharashtra 288 Nov, 20, 2024