Candidate Name |
దానం నాగేందర్ |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Khairatabad |
Candidate Current Position |
MLA |
దానం నాగేందర్ : దానం నాగేందర్ కీలక రాజకీయ నేత. హైరాబాద్ నగరంలో 1958 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. తండ్రిపేరు లింగమూర్తి, తల్లి లక్ష్మీభాయి. భార్య దానం అనిత. హైదరాబాద్ నగరంలో ఉండే ఈయన.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక నేతగా ఉన్నారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. కొద్దికాలం టీడీపీలోకి కొనసాగి ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమిలో చేరారు.
రాజకీయ ప్రస్థానం : నాగేందర్ ఆసిఫ్‌నగర్ స్థానం నుంచి 1994, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మరోసారి కాంగ్రెస్‌ను వీడి, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని ఖైరాతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను లేఖలో వివరిస్తూ, వెనుకబడిన తరగతుల వారిని పార్టీ పూర్తిగా విస్మరించిందని దానం నాగేందర్ ఆరోపించారు. రాజీనామా లేఖలో 'తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణాలో మారిన రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్ర జనాభాలో 50 శాతానికి మించి వెనుకబడిన తరగతుల వారున్నప్పటికీ, వారికి సరైన సంక్షేమం కల్పించాలని పార్టీ అధిష్ఠానానికి విన్నవించారు. నా విన్నపాలన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి..' అని తెలిపారు. 2009 లో వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన కార్మిక, ఉద్యోగ కల్పన, శిక్షణ మరియు ఫ్యాక్టరీలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు.