Candidate Name |
ఈటెల రాజేందర్ |
State |
Telangana |
Party |
BJP |
Constituency |
Gajwel |
Candidate Current Position |
MLA |
ఈటెల రాజేందర్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ మంత్రి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈటెల రాజేందర్ 1964 మార్చి 20లో జన్మించారు. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో పదో తరగతి, 1984లో మసాబ్ ట్యాంక్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ముదిరాజు కులానికి చెందిన ఆయన, రెడ్డి కులానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. కొడుకు నితిన్ రెడ్డి, కూతురు నీతా రెడ్డి ఉన్నారు.
రాజకీయ నేపథ్యం : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఈటల రాజేందర్ 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి, 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి పోటిచేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్ రావు పై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర రెడ్డి పై గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై గెలిచి కెసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. అయితే, ఈటెల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో 2021, మే 1న ఆయన నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తప్పించారు. ఆ తర్వాత మే 2వ తేదీన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, 2023 జులై 04న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కేంద్ర పార్టీ హైకమాండ్ నియమించింది.