బుధవారం, 5 మార్చి 2025
Candidate Name జి. వివేకానంద్
State Telangana
Party INC
Constituency Chennur
Candidate Current Position Former MP

కాంగ్రెస్ పార్టీ వృద్ధ రాజకీయ నేత జి.వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జి.వివేక్ అలియాస్ వివేకానంద... 15వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జి.వివేక్ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెరాసలో చేరారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. నవంబరు నెలలో బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 
 
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం చేసిన వికేకా.. ఉస్మానియా యూనివర్శిటీ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. షెడ్యూల్ కులాల్లోని మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్.. విశాఖ ఇండస్ట్రీస్‌కు వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. వి6 న్యూస్ చానెల్‌ను కూడా నడుపుతున్నారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఆ పోస్టు నుంచి తొలగించారు. 

Election Schedule
States No of Seats Date of Poll
Delhi 70 FEB, 05, 2025