Candidate Name |
జగదీష్ రెడ్డి |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Suryapet |
Candidate Current Position |
Telangana state Minister |
జి.జగదీష్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిగా ఉన్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి 1965 జూలై 18వ తేదీన జన్మించారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే, భారత రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, అర్వపల్లి మండలం, నాగారం గ్రామంలో రామచంద్రారెడ్డి మరియు సావిత్రి దంపతులకు జన్మించిన ఆయనకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. 1985లో సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం) నుంచి డిగ్రీ పూర్తి చేయగా, విజయవాడలోని సిద్దార్థ న్యాయ కళాశాల, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి లా బ్యాచిలర్ చేశారు. విద్యార్థి నాయకుడిగా, కార్యకర్తగా నిలిచి రాజకీయ నేతగా ఎదిగారు. నల్గొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. నల్గొండ జిల్లా 1వ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.
రాజకీయం హిస్టరీ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జగదీష్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రారంభ సభ్యులలో ఒకరుగా ఉన్నారు. 2009లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగుతున్నారు.