Candidate Name |
జోగు రామన్న |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Adilabad |
Candidate Current Position |
MLA |
తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్య నేతల్లో జోగు రామన్న ఒకరు. 1963. జూలై 4వ తేదీన జన్మించిన ఈయన... తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా జూన్ 2014 నుంచి 2018 సెప్టెంబరు జూన్ ఆరో తేదీ వరకు కొనసాగారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. 2009, 20012, 2014, 2018లలో నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని దీపైకూడ గ్రామంలో జన్మించారు. ఈ గ్రామ సర్పంచ్ నుంచి తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. జైనత్ నుంచి ఎంపీటీసీగాను, జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న... ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో కలిసి పని చేశారు. 2011 అక్టోబరు 10వ తేదీన తెరాసలో చేరిన జోగు రామన్న.. 2014 జూన్ 2వ తేదీన తొలిసారి మంత్రి బాధ్యతలను స్వీకరించారు.