Candidate Name |
కోనేరు కోనప్ప |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Sirpur |
Candidate Current Position |
MLA |
కోనేరు కోనప్పన.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ, మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. కోనేరు కోనప్ప 26 జనవరి 2022న కొమరంభీం జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
ఈయన 1955 జూలై 10వ తేదీన సూర్యనారాయణ, కృష్ణవేణి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో జన్మించారు. రైతు కుటుంబానికి చెందిన కోనప్ప... 1975లో కాగజ్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఈయనకు భార్య రమాదేవి, వంశీకృష్ణ, ప్రతిమ అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కోనేరు కోనప్ప.. గత 2004లో టీడీపీ పార్టీ తరపున 12వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి... తన సమీప అభ్యర్థి పాల్వాయి హరీశ్‌పై 24 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. సామాజిక సేవ చేయడంలో ముందుండే కోనప్ప.. కాగజ్ నగర్ బస్టాండు వద్ద కోనేరు నిత్య అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి రోజూ 1500 మందికి అన్నదానం చేస్తున్నారు.