Candidate Name |
కొత్త ప్రభాకర్ రెడ్డి |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Dubbaka |
Candidate Current Position |
MP |
కొత్త ప్రభాకర్ రెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోని కీలక, బడా రాజకీయ నేతల్లో ఈయన ఒకరు. ఈయనకు భార్య మంజులమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1966 జూన్ ఆరో తేదీన జన్మించిన కొత్త ప్రభాకర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి అధ్యభుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మిన బంటు. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. గత 2014లో మెదక్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. రైతు కుటుంబంలో జన్మించిన కొత్త ప్రభాకర్ రెడ్డి అంచలంచెలుగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
రాజకీయంగా.. : కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా ఉన్న నేత. అయితే, లోక్‌సభ రికార్డులను పరిశీలిస్తే అంతగా సమావేశాల్లో పాల్గొనరని తెలుసుకోవచ్చు. జూన్ 1, 2014 నుంచి ఆగస్టు 10, 2018 వరకు కేవలం 58 శాతం హాజరీ ఉంది. అదే జాతీయ సరాసరి హాజరయ్యే లోక్‌సభ అభ్యర్థుల సంఖ్య 80 శాతం. ఆయన తక్కువగా మాట్లాడతారు కానీ ఎక్కువగా రాస్తారు. ఈ కాలంలో ఆయన కేవలం 20 డిబేట్లలోనే పాల్గొన్నారు. రాతపూర్వకంగా 350 ప్రశ్నలను సంధించారు. ఇది జాతీయ సరాసరి కన్నా ఎక్కువే. అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి రాతల మనిషి అని చెప్పుకోవచ్చు.
ఆయన 3,61,833 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది అపోజిషన్ పార్టీ వారికి మింగుడుపడని విషయం. దేనికంటే అప్పటికే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ ... సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇక్కడ రాజీనామా చేశారు. దీంతో అపోజిన్ వర్గాలు తెరాస అభ్యర్థి ఎవరైనా సరే ఓడిపోతారని అనుకున్నారు. ఆశ్చర్యకరంగా భారీ మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం విశేషం.