Candidate Name |
మధుయాష్కి గౌడ్ |
State |
Telangana |
Party |
INC |
Constituency |
Lal Bahadur Nagar |
Candidate Current Position |
Former MP |
మధు యాష్కీ గౌడ్ : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల్లో మధు యాష్కీ గౌడ్ ఒకరు. 1960 డిసెంబరు 15వ తేదీన కిష్టయ్య గౌడ్, సులోచన దంపతులకు జన్మించారు. ఈయనకు ఆరుగురు చెల్లెళ్ళు, ముగ్గురు సోదరులు ఉన్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ. ఆయన నికర ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. హైదరాబాద్ నిజాం కాలేజీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన.. అటార్నీగా, రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ఆయన భార్య పేరు సుచీ మధు.
రాజకీయ నేపథ్యం : మధు యాష్కీ 2004లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికైన ఆయన 2014లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత చేతిలో ఓడిపోయారు. 2007 నుంచి ఏఐసీసీ క్రియాశీల కార్యదర్శిగా ఉన్నారు. మధు రాజకీయాల్లోకి రాకముందు న్యూయార్క్ నగరంలో న్యాయవాదిగా పనిచేశారు. అంతర్జాతీయ లీగల్ మరియు ట్రేడ్ కన్సల్టెంట్లను స్థాపించారు. ఈ సంస్థ యూఎస్ఏలోని భారతీయులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. పంటలు పండక, అప్పుల బాధతో రైతులు పడుతున్న కష్టాలను చూసి అమెరికా వదిలి ఇండియా తిరిగొచ్చారు. న్యూయార్క్, అట్లాంటాలో న్యాయ సంస్థను నడుపుతున్నారు. ఇప్పటికీ ఆ పనిని కొనసాగిస్తున్నారు. ఆయన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి అనుకూలంగా ఉంటూ, అందుకోసం తెలంగాణ ప్రజల నుండి భారీ మద్దతు కూడగట్టారు. మధు 2013లో మధు యాష్కీ ఫౌండేషన్‌ని స్థాపించి, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.