Candidate Name |
మల్లారెడ్డి |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Medchal |
Candidate Current Position |
Telangana state Minister |
సీహెచ్ మల్లారెడ్డి : ఏడు పదుల వయసులో కూడా సీహెచ్ మల్లారెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 1953 సెప్టెంబరు 9వ తేదీన సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో జన్మించారు. 12వ తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసిన ఆయన ఇపుడు తెలంగాణా రాష్ట్రంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేతగాను, పారిశ్రామికవేత్తగా ఉన్నారు. భార్య కల్పన, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది.
రాజకీయ నేపథ్యం : గత 2014లో 16వ లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. తెరాస అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై ఏకంగా 4,94,965 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి మల్లారెడ్డి కావడం గమనార్హం. ఆ తర్వాత 2016లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. 2017లో ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా, సామాజిక న్యాయం, అభ్యుదయంపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రక్షణ శాఖ ఏర్పాటు చేసిన స్టాండిగ్ కమిటీ, ఆరోగ్య, సంక్షేమ శాఖలో సలహాదారు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.