సోమవారం, 23 డిశెంబరు 2024
Candidate Name ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
State Telangana
Party INC
Constituency Huzurnagar
Candidate Current Position MP

ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి 1962 జూన్ 20న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో పురుషోత్తం రెడ్డి, ఉషాదేవి దంపతులకు జన్మించారు. అతను బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌ ఉద్యోగంలో చేశారు. మిగ్ 21, మిగ్ 23‌లను ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌లలో డ్రైవ్ చేశారు. రాష్ట్రపతి భవన్‌లో భద్రత, ప్రోటోకాల్, అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా కూడా పని చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు జనవరి 2011లో అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. 
 
రాజకీయ జీవితం : ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో కోదాడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి మారి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎంపీగా గెలిచిన తర్వాత, అతను 2018లో గెలిచిన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో హౌసింగ్, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రిగా ఉన్నారు. మార్చి 2015 నుండి జూన్ 2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక అధ్యక్షుడిగా పనిచేశాడు. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత, అతను టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 2021లో రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించేంత వరకు ఆయన పీసీసీ చీఫ్‌గా కొనసాగారు. ఈయన టెర్రర్ (2016) చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ పద్మావతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు. 

Election Schedule
States No of Seats Date of Poll
Jharkhand 81 Nov, 20, 2024
Maharashtra 288 Nov, 20, 2024