శుక్రవారం, 8 నవంబరు 2024
Candidate Name పద్మా దేవందర్ రెడ్డి
State Telangana
Party BRS
Constituency Medak
Candidate Current Position MLA

పద్మా దేవేందర్ రెడ్డి : 1969 జనవరి ఆరో తేదీన జన్మించిన పద్మా దేవేందర్ రెడ్డి... తెలంగాణ రాష్ట్ర శాసనసభకు తొలి మహిళా డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. 2014లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రామాయంపేట మాజీ శాసన సభ్యురాలు కూడా. కరీంనగర్ జిల్లా కమ్మర్‌ఖాన్ పేటలో జన్మించిన ఈమె.. బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు రంగారెడ్డి కోర్టులో అడ్వకేట్‌గా కూడా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. 
 
రాజకీయ నేపథ్యం : 2001 ఏప్రిల్ నెలలో అనుకోని విధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పద్మా దేవేందర్ రెడ్డి... 2001లో మెదక్ జిల్లా పరిషత్‌లో రామాయంపేట నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నకల్లో ఆమె 12 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అదేసమయంలో రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆమెను పార్టీ నుంచి తెరాస అధినాయకత్వం సస్పెండ్ చేసింది. 2010లో మళ్లీ పార్టీలో చేరిన ఆమె 2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 జూన్ 12వ తేదీన ఆమెను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కావడం గమనార్హం. 

Election Schedule
States No of Seats Date of Poll
Jharkhand 81 Nov, 20, 2024
Maharashtra 288 Nov, 20, 2024