సోమవారం, 23 డిశెంబరు 2024
Candidate Name పొన్నం ప్రభాకర్
State Telangana
Party INC
Constituency Husnabad
Candidate Current Position Working President of TPCC

పొన్నం ప్రభాకర్. ఆయన మే 8, 1967న జన్మించారు. 15వ లోక్ సభలో పార్లమెంటు సభ్యుడుగా వున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంటుగా వున్నారు. 2009-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పిన్నవయసులోనే ఎంపిగా ఎన్నికయ్యారు పొన్నం. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
 
రాజకీయ జీవితం...
కాలేజీ చదువుకునే రోజుల్లోనే యూనియన్ ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. ఎన్ఎస్‌యుఐ జిల్లా కార్యదర్శిగా 1987 నుంచి 1988 వరకూ పనిచేసారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 2002లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. ఆ తర్వాత అనేక పదవుల్లో ఆయన పనిచేసారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభకి పోటీ చేసి ఎంపిగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు.

Election Schedule
States No of Seats Date of Poll
Jharkhand 81 Nov, 20, 2024
Maharashtra 288 Nov, 20, 2024