శనివారం, 5 అక్టోబరు 2024
Candidate Name సబితా ఇంద్రారెడ్డి
State Telangana
Party BRS
Constituency Maheshwaram
Candidate Current Position Telangana state Minister

పి.సబితా ఇంద్రారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ మహిళా రాజకీయ నేతల్లో సబితా ఇంద్రారెడ్డి ఒ కరు. 1963 మే 5వ తేదీన జన్మించారు. తండ్రి మహిపాల్ రెడ్డి, తల్లి వెంకటమ్మ. పి.ఇంద్రారెడ్డిని వివాహం చేసుకోగా, ఆయన 2000లో నక్సలైట్ల చేతిలో హతమయ్యారు. ఈమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి చరిత్ర సృష్టించిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ మొదటి మహిళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో చరిత్ర సృష్టించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి ప్రస్థుతం మహేశ్వరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపోంది మంత్రిబాధ్యతలు స్వీకరించారు 
 
రాజకీయ ఎంట్రీ : టీడీపీ నేత,మాజీ మంత్రి అయిన పి.ఇంద్రారెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారిగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చేవెళ్ల నియోజవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014లో ఆమే మహేశ్వరం స్థానం నుండి పోటీ చేసి మూడోసారి విజయం సాధించారు. 
 
అయితే 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా బాద్యతలు నిర్వహించారు. అనంతరం 2009 మరోసారి గెలిచిన ఆమే దేశంలోనే మొదటి మహిళ హోంమంత్రిగా బాద్యతలు చేపట్టారు. ఇక 2014 ఎన్నకల్లో తిరిగి మహేశ్వరం నుండి పోటీ చేసిన ఆమే మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం ఇటివల జరిగిన 2018 ఎన్నికల్లో తిరిగి ఆమే మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలుపోందారు.
 
మే 5 1963లో ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఆమేకు ముగ్గురు సంతానం ఉన్నారు. కాగా తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సబితా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా గతంలో మొదటి మహిళ హోంమంత్రిగా భాద్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించిన ఆమే తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని మొదటి మహిళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మరో రికార్డు సృష్టించారు. 
 
రంగారెడ్డి జిల్లో కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఆమెను టీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీర్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతోపాటు పార్టీ చేరిక సమయంలోనే మంత్రిపదవి హమీ ఇచ్చారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక గ్రేటర్‌లో కూడా జిల్లా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆహ్వానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్న సీఎం సబితా ఇంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. 

Election Schedule
States No of Seats Date of Poll
Rajasthan 200 Nov, 25, 2023
Madhya Pradesh 230 Nov, 17, 2023
Telangana 119 Nov, 30, 2023
Chattisgarh-1 20 Nov, 07, 2023
Chattisgarh-2 70 Nov, 17, 2023
Mizoram 40 Nov, 07, 2023