Candidate Name |
టి. హరీశ్ రావు |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Siddipet |
Candidate Current Position |
Minister of Medical-Health and Finance Department |
టి. హరీశ్ రావు. ఆయన జూన్ 3, 1972న కరీంనగర్ జిల్లా తోటపల్లి గ్రామంలో జన్మించారు. కాకతీయ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు. బీఆర్ఎస్ పార్టీ తరపున సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన వైద్య-ఆరోగ్య మరియు ఆర్థిక శాఖామంత్రిగా పనిచేస్తున్నారు. అంతకుముందు నీటిపారుదలా శాఖామంత్రిగా 2014 నుంచి 2018 వరకూ పనిచేసారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు.
రాజకీయ జీవితం...
హరీశ్ రావు తన రాజకీయ జీవితాన్ని తెరాసతో ప్రారంభించారు. 32 ఏళ్ల వయసులో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల్లో హరీశ్ ఒకరు. 2009 ఎన్నికల్లో 60 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ కోసం మళ్లీ రాజీనామా చేసారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలా ఇప్పటివరకూ మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.