సంబంధిత వార్తలు
- జైలులో చంద్రబాబు ఎలా ఉన్నారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి?
- చంద్రబాబు ఆరోగ్యం పట్ల అమానవీయంగా వ్యవహరిస్తుంది : పవన్ కళ్యాణ్
- జగన్ కాళ్లు నాకేవాళ్లకు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తారు : బుద్ధా వెంకన్న
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరుగుతుంది : నారా లోకేశ్
- చంద్రబాబుకు అలర్జీ సమస్య : రాజమండ్రి జైలు డిఎస్పీ
చంద్రబాబు ఆరోగ్యం ఉన్నారా? హెల్త్ బులిటెన్ రిలీజ్
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయంపై రాజమహేంద్రవరం జైలు అధికారులు ప్రత్యేకంగా ఒక హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేశారు. రాజమండ్రి ప్రభుత్వం వైద్యులు చంద్రబాబును పరిశీలించి ఇచ్చిన వివరాల మేరకు ఈ బులిటెన్‌ను రూపొందించారు. ఈ బులిటెన్‌లో చంద్రబాబు ఖైదీ నంబరుతో పాటు ఆయన రిమాండ్ ముద్దాయి అని పేర్కొనడం గమనార్హం.
ఇకపోతే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే చంద్రబాబుకు బీబీ 130/80, శరీర ఉష్ణోగ్రత సాధారణంగాను, పల్స్ 64/మినిట్, శ్వాస 12/ మినిట్, హార్ట్ రేట్ ఎస్1, ఎస్ 2, ఆక్సిజన్ శాచ్యురేషన్, గచి వాతావరణం వద్ద 96శాతం, ఊపిరితిత్తులు క్లియర్, శారీరక, క్రియాశీలత బాగుందని, బరువురు 67 కేజీలుగా ఉన్నారని పేర్కొంది. ఈ హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తుంది.
