మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:22 IST)

దమ్ముంటే నాపై పోటీ చెయ్ : మహేష్ కత్తికి శివప్రసాద్ సవాల్

సినీ విశ్లేషకుడు మహేష్ కత్తికి దమ్ముంటే నాపై పోటీ చేయమంటూ చిత్తూరు ఎంపికి శివప్రసాద్ బహిరంగ సవాల్ విసిరారు. ఒక దళితుడి మీద మరో దళితుడు అబాండం వేయడం బాధాకరమన్నారాయన.

సినీ విశ్లేషకుడు మహేష్ కత్తికి దమ్ముంటే నాపై పోటీ చేయమంటూ చిత్తూరు ఎంపికి శివప్రసాద్ బహిరంగ సవాల్ విసిరారు. ఒక దళితుడి మీద మరో దళితుడు అబాండం వేయడం బాధాకరమన్నారాయన. నా వేషం బాగుందని వేలమంది ఫోన్లు చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ, మహేష్ కత్తిలు నాపై ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ, మహేష్ కత్తిలు మోడీకి ట్వీట్లు చేయాలని సూచించారు.
 
రాంగోపాల్ వర్మకు తిక్కని, దర్శకత్వ లక్షణాలు ఆయనకు ఏ మాత్రం లేదన్నారు. తెదేపా ఎంపీలను ప్రశ్నించడానికి రాంగోపాల్ వర్మ ఎవరని ప్రశ్నించారు. ఈరోజుతో రాంగోపాల్ వర్మపై ఉన్న గౌరవం పూర్తిగా పోయిందన్నారు. మార్చి 5వ తేదీ పార్లమెంటులో శ్రీకృష్ణుని వేషంతో వెళుతున్నానని, సంధినా(యుద్ధమా).. సమరమా అని మోడీని ప్రశ్నిస్తానని చెప్పారు.