ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 29 జులై 2017 (12:19 IST)

కూతురిని గర్భవతి చేసిన తండ్రి...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. శారీరక సుఖం కోసం కొంతమంది వావి వరుసలు మరిచిపోతున్నారు. వరుసకు కూతురయ్యే చిన్నారిని గర్భవతిని చేశాడో తండ్రి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతో

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. శారీరక సుఖం కోసం కొంతమంది వావి వరుసలు మరిచిపోతున్నారు. వరుసకు కూతురయ్యే చిన్నారిని గర్భవతిని చేశాడో తండ్రి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
చిత్తూరు సంతపేటకు చెందిన ఒక మహిళను 15 సంవత్సరాల క్రితం భర్త వదిలి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె ఉంది. స్థానికంగా ఒక ప్రైవేటు హోటల్లో పనిచేస్తున్న ఆ మహిళకు అక్కడే పనిచేస్తున్న మరో వ్యక్తితో పరిచయమై పెళ్ళి చేసుకుంది. కుమార్తెతో పాటు ముగ్గురూ కలిసే ఉన్నారు. 
 
గత నాలుగు క్రితం మహిళ హోటల్‌కు వెళ్ళిన సమయంలో బాలిక(16) ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కామాంధుడు శీతలపానీయంలో మత్తుమందు కలిపి తాగించాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోగా ఆమెకు శారీరకంగా అనుభవించాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. 
 
దీంతో బాలిక తల్లికి చెప్పలేదు. రెండురోజుల క్రితం బాలిక వాంతులు చేసుకుంటుండడాన్ని గమనించిన తల్లి గట్టిగా ప్రశ్నించింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ బాలిక మూడునెలల గర్భిణిగా వైద్యులు చెబుతున్నారు. బాలిక తల్లి చిత్తూరు రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.