ఒంటరిగా వున్న చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం... ఇంట్లోకి తీసుకెళ్లి?

Last Updated: శనివారం, 24 ఆగస్టు 2019 (08:52 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు.. వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ కామాంధుడు తాగిన మైకంలో చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఓ వ్యక్తి ఒంటరిగా కనిపించిన మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన కలివేముల పాపయ్య (38) గురువారం సాయంత్రం ఒంటరిగా కనిపించిన చిన్నారిని చూసి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఏడుస్తూ ఇంటికొచ్చిన కుమార్తెను చూసిన తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపయ్యను అరెస్టు చేసిన పోలీసులు అతనిని జైలుకు పంపారు. దీనిపై మరింత చదవండి :