ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (11:23 IST)

జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం.. అనూష బ్రెయిన్ డెడ్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనూష అనే యువతి తీవ్రగాయాల పాలైంది. ఈ ప్రమాదంలో అనూష బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మస్తానీ అనే యువతి ప్రాణాలు కోల్పోగా, అనూషతో

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనూష అనే యువతి తీవ్రగాయాల పాలైంది. ఈ ప్రమాదంలో అనూష బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనలో మస్తానీ అనే యువతి ప్రాణాలు కోల్పోగా, అనూషతో పాటు గాయపడిన ప్రియ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ అనూష అనే యువతి బ్రెయిన్ డెడ్ అయ్యింది.
 
ఇకపోతే.. అనూష, ప్రియ, మస్తానీ ముగ్గురూ కలిసి వాహనంపై వస్తుండగా, 'టీఎస్ 09 ఈవీ 7707' నంబర్ గల కారులో వచ్చిన విష్ణువర్ధన్ యాక్సిడెంట్ చేశాడు. విష్ణు తమ అదుపులోనే ఉన్నాడని, అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెపుతున్నారు. జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం ఏర్పడిందని పోలీసులు చెప్తున్నారు.