శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 8 జులై 2021 (15:59 IST)

ఈ అమ్మాయి బ్లేడ్‌తో చేయి కోసుకుంది, కార‌ణం ఏమిటో??!

విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలోని సీతమ్మ వారి పాదాలు వద్ద ఈ అమ్మాయి అఘాయిత్యానికి పాల్ప‌డింది. త‌న చేతిని బ్లేడుతో కోసుకుని ఈ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన పాదచారులు ప్రకాశం బ్యారేజీ పై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ఆ యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇది ప్రేమ వ్య‌వ‌హార‌మా?  లేక కుటుంబంలో క‌ల‌త‌లా అనేది తెలియాల్సి ఉంది. యువ‌తి ఆత్మ‌హ‌త్య యత్నంపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని బెజ‌వాడ పోలీసులు చెపుతున్నారు.