1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Three Students Drowned while Swimming in Prakasam Dist

ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు.. ఎక్కడ?

Three Students Drowned
ప్రకాశం జిల్లా దర్శిలో విషాదం చోటుచేసుుకంది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికంగా ఉండే సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన ఈ ముగ్గురు విద్యార్థులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. దర్శి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోని శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేశ్ (19), కందురి చందుకిరణ్ (18), బత్తుల మణికంఠ రెడ్డి (18)లు అనే ముగ్గురు స్నేహితులు సాగర్ కాలులో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. 
 
గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానిక ప్రజలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా పోతిరెడ్డి లోకేశ్ మృతదేహం మాత్రం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. చేతికొచ్చిన బిడ్డలు దూరం కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 
తర్వాతి కథనం
గ్రేటర్ నోయిడా: వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపేశాడు..