1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Donald Trump may launch unilateral nuclear attack, Hillary Clinton warns

డొనాల్డ్ ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధానికి తెరదీశారు: హిల్లరీ క్లింటన్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. దౌత్యపరంగా పరిష్కరించాల్సిన ఉత్తర కొరియా సమస్యను తన తెలివితక్కువ తనంతో ట్రంప్ జఠిలం చేశారన్నారు. తద్వార

Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. దౌత్యపరంగా పరిష్కరించాల్సిన ఉత్తర కొరియా సమస్యను తన తెలివితక్కువ తనంతో ట్రంప్ జఠిలం చేశారన్నారు. తద్వారా మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేలా ఉన్నారని హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు.

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిద్దామని సూచించిన వారినే ట్రంప్ తప్పు బట్టారన్నారు. దీంతో న్యూక్లియర్ రేసును ట్రంపే మొదలుపెట్టినట్టైందని ఆమె విమర్శించారు. 
 
ప్రారంభంలో ఉత్తర కొరియా సమస్యను చైనా సహకారంతో చర్చలు జరిపి వుంటే బాగుండేదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఉత్తరకొరియా విధానాలుకూడా సరిగాలేవని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను లెక్కచేయకుండా ఉత్తరకొరియా అణు పరీక్షలను ప్రయోగించడం సరికాదని స్పష్టం చేశారు. అలాగే గువామ్‌పై దాడి పేరిట జపాన్ మీదుగా మిస్సైల్ ప్రయోగించడం ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనన్నారు. ఇలాంటి ప్రయోగాలను ఏ దేశమూ జరుపకూడదని స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోంది : ట్రెంట్ ఫ్రాంక్స్