1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Peckham train delayed after mother loses baby on the train

రైల్వే స్టేషన్‌లో బిడ్డను మరిచిపోయిన మహాతల్లి.. ఎక్కడో తెలుసా?

Peckham Rye
రైళ్లు, బస్సుల్లో, ఆటోల్లో లగేజీని మరిచిపోతూ వుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఓ మహాతల్లి కన్నబిడ్డనే మరిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని పెక్కాహ్యామ్ రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి ప్రయాణిస్తుంది. తోడుగా పసిబిడ్డ కూడా ఉంది. అయితే స్టేషన్ రాగానే హడావుడిగా రైలు దిగేసింది తల్లి. కొంచెం దూరం నడవగానే చూసుకుంటే పసిబిడ్డ లేదనే విషయం గుర్తొచ్చింది. 
 
అప్పటికే రైలు కదలడంతో లబోదిబోమని గుండెలు బాధకుంటూ స్టేషన్ సిబ్బందికి విషయం చెప్పి ప్రాధేయపడింది. వారు ముందు స్టేషన్లో రైలును కాసేపు ఆపి ఆమెను మరొక రైల్లో ముందు స్టేషన్‌కు, తరలించి తల్లిబిడ్డను కలిపారు. 
 
రైలును కొంత సమయం ఆపడం వల్ల అటుగా వెళ్లే రైళ్లన్నీ ఆలస్యమయ్యాయి. రైల్లో ప్రయాణించే ప్రయాణికులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు కన్నబిడ్డను అలా ఎలా మర్చిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తర్వాతి కథనం
ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభం... హాట్ కేకుల్లా మారిన టిక్కెట్లు