బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (17:03 IST)

తోడబుట్టిన చెల్లెమ్మపై ఏడాది పాటు అన్నయ్య అత్యాచారం.. చాక్లెట్ ఇచ్చి?

సోదర బంధానికి కళంకం తెచ్చాడు. తన తోడబుట్టిన చెల్లెమ్మపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్ నగరంలో నాలుగేళ్ల చిన్నారిపై ఆమె 13 ఏళ్ల సోదరుడు అ

సోదర బంధానికి కళంకం తెచ్చాడు. తన తోడబుట్టిన చెల్లెమ్మపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్ నగరంలో నాలుగేళ్ల చిన్నారిపై ఆమె 13 ఏళ్ల సోదరుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆ బాలుడికి 13 ఏళ్లు. ఏడాది పాటు తన సోదరిపై ఈ అకృత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 
 
ఇంకా తన చెల్లెలకు చాక్లెట్ ఇచ్చి ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకూడదని బెదిరించాడు. అయితే ఈ విషయాన్ని ఆ చిట్టి తల్లి తన తల్లితో చెప్పేసింది. ఆడుకుంటున్న సమయంలో తన సోదరుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో ఈ వ్యవహారం కోర్టులో విచారణ జరుగుతోంది. 
 
ఈ విచారణ సందర్భంగా బాలుడు ఫోనులో అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు వున్నట్లు తెలియవచ్చింది. దీంతో  బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి.. అతనిపై ఓ కన్నేసి వుంచాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆ బాలుడితో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అనే కోణంలో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల నివేదిక ఆధారంగా బాలుడికి జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెప్తున్నారు.