1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Wading on his wedding day in Gujranwal

వరుడి కారు వరదల్లో చిక్కుకుంది.. పట్టువదలకుండా నెట్టుకెళ్ళి.. పెళ్ళి చేసుకున్నాడు.. (వీడియో)

అందరికీ పెళ్ళి జరిగే రోజు గుడ్ డే అయితే.. పాకిస్థానీ పెళ్ళికొడుకుకు మాత్రం బ్యాడ్ డే అయ్యింది. అవును. అతను మండపానికి వెళ్లేందుకు వీలుగా రోజా పువ్వులతో అలంకరించబడిన కారు వరదల్లో చిక్కుకోవడంతో.. కారు ను

Pakistan
అందరికీ పెళ్ళి జరిగే రోజు గుడ్ డే అయితే.. పాకిస్థానీ పెళ్ళికొడుకుకు మాత్రం బ్యాడ్ డే అయ్యింది. అవును. అతను మండపానికి వెళ్లేందుకు వీలుగా రోజా పువ్వులతో అలంకరించబడిన కారు వరదల్లో చిక్కుకోవడంతో.. కారు నుంచి పెళ్లి కొడుకుగా షెర్వానీలో ముస్తాబైన వరుడు కారును నీటి నుంచి బయటకు తోసేందుకు ప్రయత్నించాడు. ప్రయత్నం సఫలం అయ్యింది. తద్వారా తన పెళ్లికి వ‌ర‌ద నీరు అడ్డం కాద‌ని నిరూపించాడు.
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని పంజాబ్ జిల్లా గుజ్రాన్‌వాలా ప్రాంతంలో వ‌రుస‌గా వ‌ర్షాలు కుర‌వ‌డంతో రోడ్ల మీద మోకాల్లోతు నీరు చేరుకుంది. ఆ నీరు ఈ పెళ్లికొడుకు కష్టాలు కొని తెచ్చిపెట్టింది. పెళ్లి కొడుకు  కారు నీటిలో ఇరుక్కుపోవడంతో.. పెళ్ళికొడుకే ధైర్యంగా.. తానే స్వ‌యంగా.. ఇతరుల సాయం కోరకుండా కారును పెళ్లిమండ‌పం వ‌ర‌కు నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
About Writer
Selvi
తర్వాతి కథనం
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్‌... శృంగారానికి నో అన్నందుకు ఆ సైట్లో పెట్టేశాడు...