1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Police Case Filed On MLA Lasya’s Driver

ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం.. మత్తులో డ్రైవర్.. కేసు నమోదు

lasya nandita
బీఆర్ఎస్ పార్టీకి చెందిన అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఫిబ్రవరి 23 తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మరణించిన యువ రాజకీయ నాయకురాలికి శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
 
లాస్య నందిత సోదరి నివేదిత ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పటాన్‌ చెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 
కారు డ్రైవర్ ఆకాష్‌పై సెక్షన్ 304 కింద నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. డ్రైవర్ అతివేగంతో కారు నడుపుతున్నాడని, నిద్రమత్తులో ఉన్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
 
ఈ ప్రమాదంలో లాస్య నందిత ఎడమ కాలు ఫ్రాక్చర్, పక్కటెముకలు పగుళ్లు, తలకు తీవ్రగాయాలు కావడంతో లాస్య అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ కాలు విరిగి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్నాక పోలీసులు అతడిని విచారించనున్నారు.
About Writer
సెల్వి