సంబంధిత వార్తలు
- తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు
- నిజామాబాద్ - హైదరాబాద్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు
- అమేజాన్ పే యుపిఐతో 10 కోట్ల భారతదేశ వినియోగదారుల డిజిటల్ చెల్లింపులు
- రక్షా బంధన్‌తో టీఎస్సార్టీసీ రికార్డ్.. 38 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం
- ఇక ఏపీ మద్యం షాపుల్లో నో మనీ.. డిజిటల్ చెల్లింపులు మాత్రమే..!
తెలంగాణ బస్సుల్లో క్యూఆరో కోడ్ చెల్లింపులు... చిల్లర సమస్యకు బైబై
తెలంగాణ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర విషయంలో తలెత్తే సమస్యకు ఇకపై చెక్ పడనుంది. టీజీఎస్ఆర్‌టీసీ ప్రయాణికుల కోసం త్వరలో క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తేనుంది. దాంతో గూగుల్ పే, ఫోన్‌పే, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్‌ను ఆర్‌టీసీ బస్సుల్లో అనుమతించాలని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ సూచనప్రాయంగా సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ డిపోలోని బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ పేమెంట్లను అమలు చేయగా, ఆ ప్రయోగం విజయవంతమైంది. త్వరలో క్యూఆర్ కోడ్ విధానం అన్నీ రూట్ బస్సుల్లో అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
