నాగ్ సరసకు సెక్సీ యాంకర్ సై... కెమిస్ట్రీ కుదిరేనా..!
వెండితెరపై స్టార్ హీరోయిన్‌లుగా వెలిగిపోతున్న అందాల భామలకు ధీటుగా ఇటీవల కాలంలో బుల్లితెర బ్యూటీలు కూడా శృంగారాన్ని ఒలకబోస్తున్నారు. అందులోనూ టాలీవుడ్‌లో హాట్ యాంకర్ల జోరు కాస్త ఎక్కువే. ఈ దిశలో సెక్సీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న అందాలరాసి అనసూయ. టీవీ ప్రోగ్రాములలో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీకి నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ చిక్కింది.
నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. ఇందులో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర నటించేందుకు అనసూయకు ఆఫర్ వచ్చింది. ఇందులో ఈ అమ్మడు నాగార్జునకు మరదలుగా నటిస్తుందని సమాచారం.
ఇందులో నాగ్ - అనసూయల మధ్య బావ మరదలి చిలిపి సన్నివేశాలు మాత్రమే కాకుండా, ఓ డ్యూయెట్ కూడా వుందట. ఇప్పటికే అడవి శేష్ సరసన 'క్షణం' అనే సినిమాలో అనసూయ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.