సంబంధిత వార్తలు
- మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్
- Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్
- మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార
- Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి
- మలయాళ సినిమా జింఖానా ట్రైలర్ కు అనిల్ రావిపూడి ప్రమోషన్
Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్
Mega 157 Latest poster
బుధవారంనాడు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. 20 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ నటుడు శరత్ సక్సెనా ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి తో ఢీ అంటే ఢీ అనేలా కొన్ని సన్నివేశాలను కొద్దిరోజులలో తీయనున్నారు.
నేడు చిరంజీవితోపాటు పలువురు ఫైటర్లు, రౌడీలు కాలేజీ ఆవరణ బయట పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నవకాంత్ ఫైట్ మాస్టర్ ఆద్వర్యంలో వినూత్నంగా యాక్షన్ లో ఎంటర్ టైన్ మెంట్ వుండేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. ఆల్ రెడీ సంక్రాంతికి వస్తున్నాం తరహాలో కాకుండా అంతకుమించి చిరంజీవి శైలిలో వుంటుందని తెలుస్తోంది. ఇంతకుముందు చిరంజీవి కుడిచేతితో నమస్కారం పెడుతూ వున్న స్టిల్ ను కూడా విడుదలచేశారు. గతంలో చిరంజీవి మాస్టర్ సినిమా చేశారు. ఇప్పుడు మాస్టర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కలయికగా వుండబోతుందని వినికిడి.
ఇంకా ఈ సినిమాలో కేథరిన్ కూడా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశ్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
