1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Niharika Konidela, Nara Rohit to share screen!

నారా రోహిత్‌తో మెగా హీరోయిన్ నిహారిక.. పవన్ దర్శకత్వంలో సినిమా?

నారా వారి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్‌తో సావిత్రి సినిమా తీసిన పవన్ సాదినేని మరోసారి చేతులు కలుపనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అయ్యిందట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెగా హీరోయిన్ నిహారికను తీసుకునే ఆలో

Niharika Konidela
నారా వారి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్‌తో సావిత్రి సినిమా తీసిన పవన్ సాదినేని మరోసారి చేతులు కలుపనున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అయ్యిందట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెగా హీరోయిన్ నిహారికను తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ''ఒక మనసు'' సినిమాలో నటించిన నిహారిక రెండో సినిమా కాస్త గ్యాప్ తీసుకుంది. 
 
ఇప్పటికే తమిళంలో ఓ డెబ్యూ మూవీ ఓకే చేసిన నిహారిక.. తెలుగు సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉంది. తాజాగా పవన్ సాధినేని ఆఫర్ ఇవ్వడంతో కాస్త టైమ్ కావాలని అడిగిందట. ఆ టైమ్ కూడా వచ్చేసిందని.. త్వరలో నారా హీరోతో మెగా హీరోయిన్ సినిమా చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. తొలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆలోచిస్తున్న నిహారిక పవన్ డైరక్షన్ గురించి తెలుసుకుని ఈ సినిమా ఛాన్సును సద్వినియోగం చేసుకుంటుందని సినీ జనం అనుకుంటున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్, పవర్ స్టార్‌తో 'బాహుబలి తాత'ను తీస్తా... టి.సుబ్బరామిరెడ్డి