1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Sunny Leone Planning To Have A Child Soon?

చూస్తూ వుండండి.. ఓ రోజు చేతిలో బిడ్డతో మీ ముందు నిలబడతా: సన్నీలియోన్

ఓ రోజు చేతిలో బిడ్డతో మీ ముందు నిలబడతానని బాలీవుడ్ నటి సన్నీలియోన్ చెప్పింది. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా మారిన సన్నీ లియోన్.. తాజాగా ఓ టీవీ షోలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ టీవీకి ఇచ్చిన

Sunny Leone
ఓ రోజు చేతిలో బిడ్డతో మీ ముందు నిలబడతానని బాలీవుడ్ నటి సన్నీలియోన్ చెప్పింది. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా మారిన సన్నీ లియోన్.. తాజాగా ఓ టీవీ షోలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో నటనా పరంగా బిజీ కావడంతో తాను తల్లినయ్యే అవకాశం లేదని.. అయితే ఓ రోజు ఉన్నట్టుండి చేతిలో బిడ్డతో మీ ముందుకు వస్తానని చెప్పింది. అప్పుడు అందరూ షాక్ అవుతారంది. 
 
ఆ బిడ్డ ఎలా వచ్చిందనే అనుమానం కూడా కలగకతప్పదని చెప్పింది. కాగా సన్నీ లియోన్ పోర్న్ సినిమాల్లో కనిపిస్తూ.. ఆపై బాలీవుడ్‌ స్టార్‌గా మారిపోయింది. అక్కడ హీరోయిన్‌గా నటించాలని.. తన గ్లామర్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలతో సన్నీ పోటీపడుతోంది. ఇలాంటి తరుణంలో తల్లినైతే అవకాశాలు దూరమవుతాయని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ బిడ్డతో కనిపిస్తానని చేసిన కామెంట్సును బట్టి చూస్తే ఆమె త్వరలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఛాన్సుందని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
About Writer
Selvi
తర్వాతి కథనం
జగన్ తినే ఆహారమే వాళ్లింట్లో బాయ్‌కి కూడా పెడతారు : మెగా హీరో