మంగళవారం, 10 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (10:08 IST)

మే 6న హైదరాబాదులో బ్రహ్మోత్సవం ఆడియో: మే20న సినిమా రిలీజ్!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'బ్రహ్మోత్సవం'' చిత్రం షూటింగ్‌ పూర్తికానుంది. ఈ చిత్రంలో సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత నాయికలు. ఈ చిత్రం రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు డైలమాలో పడ్డారు. 
 
ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా షూటింగ్ లేటవ్వడంతో మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు కూర్చిన పాటల్ని మే 1న తిరుపతిలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు మొదట భావించారు. అయితే తాజాగా ఆడియో విడుదల తేదీతో పాటు వేదిక కూడా మారింది. 
 
మే 6న హైదరాబాద్‌లోనే పాటల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే చిత్రాన్ని మే 20న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సత్యరాజ్‌, జయసుధ, రేవతి, శరణ్య, నరేశ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, సాయాజీ షిండే ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.