NTR: ఎన్.టి.ఆర్. డ్రాగన్ డేట్ ఫిక్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్
NTR's 'Dragon latest poster
కొత్త పోస్టర్ విడుదల చేస్తూ, జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ విడుదలవుతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవల ఎన్.టి.ఆర్. గాయాలు పాలయి విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆల్ రెడీ షూటింగ్ జరుగుతుందంటూ పేర్కొన్నారు. దీనితో దర్శకుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కేజీఎఫ్, సలార్ తరహాలోనే ఈ డ్రాగన్ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాలీవుడ్, బాలీవుడ్ ఆడియెన్స్ గట్టిగా భావించారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాలను ఫ్రాంచైజీలుగా ప్లాన్ చేస్తే, ఆ విషయాన్ని టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలోనే స్పష్టం చేస్తారు. కానీ, డ్రాగన్ విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం ఒకే ఒక్క భాగంగా రాబోతుందని క్లియర్ అవుతోంది.
