Dilkar: రెండు వారాలు వాయిదా పడి డేట్ ఫిక్స్ అయిన దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్
Dulquer Salmaan
దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్‌కు నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబూబకర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా.. సజీర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు.
ఐ యామ్ గేమ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ట్రైలర్‌లో అదిరిపోయే విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. దుల్కర్ సల్మాన్‌ను స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా.. మలయాళ సినీ పరిశ్రమలో భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ సినిమా కావడం మరో ప్రత్యేకత. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

