ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకులు కొందరేనా!
bedurulanka2012
Gandhiwadhari Arjuna
ఇక కన్నడ సినిమా తెలుగులో బాయ్స్ హాస్టల్‌గా విడుదలైంది. ఇందులో రష్మిక గౌతమి ఎపిసోడ్ సెపరేట్‌గా చిత్రీకరించారు. లెక్చరర్‌గా ఆమె నటించింది. మరోవైపు గ్లామర్‌తో అందాలతో అలరించింది. హాస్టల్ వార్డెన్‌ను అనుకోకుండా బాయ్స్ చంపేస్తారు. అది ఎందుకు? ఎలా? అనేది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో చూపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.
ఇక ప్రవీణ్ సత్తారు తన దర్శకత్వంలో చేసిన గాంఢీవదారి అర్జున సినిమా అటూ,ఇటూ కాకుండా పోయింది. సినిమాటోగ్రఫీ, సంగీతపరంగా మినహా కథలో సామాన్యుడికి పనికివచ్చే అంశం లేకపోవడం పధాన లోపం. దేశంలో అందరూ ఎదుర్కొంటున్న పర్యావరనణ కాలుష్యం, మానవుని జీవితంలో రానురాను ఏవిధంగా నాశనం చేస్తుందనేది చెప్పేక్రమంలో ఎక్కువ భాగం హింస ఎక్కువ కావడంతో పక్కదోవ పటిందని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. ఏదో మంచి సందేశం ఇవ్వాలని చూసిన దర్శక నిర్మాతలకు ఇది పెద్ద బ్రేక్‌పడింది. అందుకే ఒక్కోసారి మన ఆలోచలనకు ప్రేక్షకులు అందరు అని ప్రవీణ్ సత్తార్ ఓ సందర్భంగా అనడం విశేషం. ఏదిఏమైనా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ప్రేక్షకులకు ఇప్పుడు కావాల్సింది కేవలం వినోదమే. అంతకుముందు ఏదైనా చెబితే వారికి క్లాస్‌పీకినట్లుంటుందని తెలియజేస్తున్నారు.
