సంబంధిత వార్తలు
- విజయం మీది... విజయ రథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నా...
- విద్యాబాలన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బసవతారకం లుక్
- శివానీ రాజశేఖర్-అడవి శేష్ '2 స్టేట్స్' ఫస్ట్ లుక్ విజయదశమికి...
- ఎన్టీఆర్ బయోపిక్ : వాళ్ళ నాన్నగారిలా బాబాయ్... మా నాన్నగారిలా నేను...
- ట్రాన్స్‌జెండర్‌గా విజయ్ సేతుపతి... సమంత, రమ్యకృష్ణలు...
లేడీ ఓరియెంటెడ్ సినిమా అని ఎందుకంటారు?: అనసూయ ప్రశ్న
బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సం
బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లోని లుక్‌ను బట్టి నెటిజన్లు ఇదో లేడి ఓరియెంటెడ్ సినిమా అని కామెంట్లు పెట్టారు.
ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ.. ఏ చిత్రంలోనైనా హీరో ప్రధాన పాత్రలో కనిపిస్తే దాన్ని కథానాయకుడి ప్రాధాన్యం వున్న సినిమా అని ఎవ్వరూ చెప్పరు. అదే ఓ నటి ప్రధాన పాత్రలో కనిపిస్తే మాత్రం ప్రత్యేకించి దాన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటారు. అయినా ఇలా ఎందుకంటారు.. అంటూ అనసూయ ప్రశ్నించింది.
కానీ ఆ ప్రశ్నేసిన తర్వాత కొంత సమయానికే తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. నిజాయితీగా అడిగానని చెప్పింది. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం వుంటుంది. సినిమాకు ప్రతి పాత్ర ముఖ్యమే. తామంతా పాత్రల్ని పోషిస్తున్నాం. సరైన విధంగా మమ్మల్ని పిలవాలనేది తమ అభిప్రాయం. ప్రధాన పాత్రలో ఆయన/ఆమె నటిస్తున్నారు అంటే సరిపోతుంది కదా అంటూ అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ అనసూయ కథనం ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
