సంబంధిత వార్తలు
- సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని
- మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్ సిద్ధం
- Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే
- కీర్తి సురేష్ ఆడియో విని షాక్ అయిన సమంత రూత్ ప్రభు.. ఏంటది?
- Keerthy Suresh Wedding: అట్టహాసంగా కీర్తి సురేష్ వివాహం (ఫోటోలు)
ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్
Naga Ashwin
దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ... "కల్కి సినిమా చేయడానికి మాకు ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ చిత్రం కోసం ఎంతోమంది భారతదేశ సినీ చరిత్రలోనే ఇప్పటివరకు లేని ఒక గొప్ప విజువల్ వండర్ ను రూపొందించాము. దానికిగాను ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చినప్పటికీ తర్వాత మన తెలంగాణ గద్దర్ అవార్డు రావడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గద్దర్ అవార్డును ప్రారంభించి ముందుకు తీసుకు వెళుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
కేవలం ఈ సంవత్సరం కాకుండా ఎన్ని సంవత్సరాలుగా చేసిన సినిమాలన్నిటిని గుర్తించి అవార్డులు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. సినీ రంగంలో బాక్సాఫీసు రికార్డుల కంటే ఎటువంటి అవార్డులు అనేవి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వం నుండి వచ్చే ఇటువంటి గుర్తింపులు మమ్ములను మరింత ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. అలాగే 2018 లో వచ్చిన మహానటి చిత్రానికి కూడా ఇన్ని సంవత్సరాలకు బెస్ట్ చిత్ర అవార్డు ఇచ్చినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకుగాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నారు.
