1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Huge exclusive update about Sri Krishna in Kalki 2 !

Kalki 2 Update: కల్కి 2 లో శ్రీకృష్ణుడి గురించి భారీ ప్రత్యేక వార్త !

Kalki 2 new poster
Kalki 2 new poster
నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర మొహం కనిపించకుండా జాగ్రతపడ్డారు. సీక్వెల్ రిలీవ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా కల్కి 2 షూటింగ్ జరుపుతున్నారు. ఇందులో శ్రీకృష్ణుడి కీలక పాత్రను పోషించబోయేది ఒక భారీ పాన్-ఇండియా స్టార్ ను ఎంపిక చేశారు. అప్పట్లో బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ వున్నాడని అన్నారు. 
 
లేటెస్ట్ గా ఓ పోస్టర్ విడుదలయింది. ఫెయిత్, ధర్మ, డెస్టినీ, కల్కి అంటూ ఆ అవతారానికి సంబంధించిన కథగా అందులో రాసి వుంది. శ్రీకృష్ణుడి పాత్ర వెనుక భాగం చూపిస్తూ, ఎదురుగా రథాలు, యుద్ధ వాతావరణాన్ని తలపించేలా వుంది. సీక్వెల్ లో మహాభారత ఎపిసోడ్ ఎక్కువగా వుంటుందనేలా కొటేషన్ చెబుతోంది. 
 
మునుపటి చిత్రంతో పోలిస్తే  కల్కి2 లో మహాభారత ఘట్టాలు మరింత విస్తృతంగా ఉండబోతున్నాయి; వాటిని సాధ్యమైనంత అద్భుతంగా, భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్ర బృందం సర్వశక్తులూ ఒడ్డుతోంది. టెక్నికల్ గా హై వాల్యూస్ వుండేలా దర్శక నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
ఇటీవలే చిత్ర నిర్మాత ఓ  ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో.. పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ 2026 అక్టోబర్‌లో ప్రారంభమై, 2027 మధ్య నాటికి పూర్తవుతుందని ధృవీకరించారు. మొదటి చిత్రం 'సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం' మరియు 'ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్' విభాగాలలో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న కొద్ది కాలానికే ఈ అప్‌డేట్ వచ్చింది. ఈ గుర్తింపు తమ బృందానికి 'మంచి ఉత్సాహాన్ని' ఇచ్చిందని నాగ్ అశ్విన్ అభివర్ణించారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Avengers: Endgame: అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్ చూడాల్సిన 5 కారణాలు