నేనూ రోజూ స్టూడెంట్‌గానే ఫీలవుతాను : విశ్వక్సేన్
Bellamkonda Ganesh, Viswaksen, Avantika
అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ, నేనూ రోజూ స్టూడెంట్‌గానే ఫీలవుతాను. ఈ టైటిల్ విన్నప్పుడు కాలేజీ రోజులు గుర్తుకు వచ్చేవి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు నేను స్టూడెండ్ సార్ అనేవాడిని. టీజర్ లుక్చాలా ప్రామిసింగ్‌గా వుంది. నిన్న నాంది సతీష్‌గారు వచ్చి ఆహ్వానించారు. ఆయన చెప్పిన కంటెంట్ నచ్చింది. నేనూ పార్ట్ కావాలని ఈరోజు వచ్చాను. ఇంకో కారణం బెల్లంకొండ గణేష్. మే మిద్దం జుంబ్లా క్లాస్‌కు వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత జిమ్‌లో కలిశాం. గణేష్ కాంటెపరరీ కథలతో వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రచయిత కృష్ణ చైతన్య కూడా దర్శకత్వం చేస్తున్నాడు. ఇందులో పాట రాసిన హర్ష కూడా మా సినిమాలో లవ్ సాంగ్ రాశాడు. సాగర్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ, ఈరోజు సాంగ్ చూశారు. ఫోన్ కొనడానికి కష్టపడుతూండగా వచ్చే మోన్టేజ్ సాంగ్ ఇది. చాలా ఎంజాయ్ చేసేలా వుంటుంది. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని సినిమాలుచేసే విశ్వక్ అంటే ఇష్టం. తన నుంచి చాలా నేర్చుకోవాలి. పదేళ్ళనాడు తనను కలిసినప్పుడు చాలా క్లాస్ గా వుండేవాడు. అలాంటిది దాస్కామాస్ అంటూ మారిపోయాడు. జూన్2న మా సినిమా విడుదలవుతుంది. తప్పకుండా చూడండి అని అన్నారు.

