నాని సమర్పణలో `మీట్ క్యూట్` ప్రారంభం
Nani, sathya raj
వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్ నుంచి ఇప్పటికే అ!, హిట్ వంటి కంటెంట్ ఉన్న సక్సెస్‌పుల్ సినిమాలు వచ్చి సక్సెస్ సాధించిన తరుణంలో మీట్ క్యూట్` కూడా అలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాగా రూపొందుతోంది. అలాగే వాల్ పోస్టర్ సినిమాస్ పతాకం ద్వారా ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తాజాగా `మీట్ క్యూట్` సినిమాతో దీప్తి ఘంట అనే నూతన దర్శకురాలు పరిచయం అవుతోంది.
వాల్‌పోస్టర్స్ సినిమాలో ప్రొడక్షన్ నెంబర్ 4గా మీట్ క్యూట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ కొత్త ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది అని ట్వీట్ చేశారు నేచురల్ స్టార్ నాని.
క్రేజీ మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్నమీట్ క్యూట్‌లో కొంత మంది ప్రముఖ హీరోయిన్స్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు.
వసంతకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రయూనిట్ అతి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
సాంకేతిక వర్గం:
సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: దీప్తి ఘంట
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
డి ఓ పి: వసంత్ కుమార్
సంగీతం: విజయ్ బుల్గనిన్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: గ్యారీ బీహెచ్
లిరిక్స్: కేకే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
తర్వాతి కథనం
