1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nidhi Agarwal with Mahesh Babu

మహేష్ బాబు సరసన ఇస్మార్ట్ భామ..

Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నిధి అగర్వాల్ నటించనుంది. 'ఇస్మార్ట్ శంకర్'తో లైన్లోకి వచ్చిన నిధి అగర్వాల్.. పెద్దగా ప్రాజెక్టులు లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్‌తో రచ్చ చేస్తూ వస్తోందీ అమ్మడు. 
 
ఇదిలా ఉంటే మహేశ్, త్రివిక్రమ్ కలయిలో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. ఇందులో హీరోయిన్ గా పూజా హేగ్డే పేరు వినిపిస్తోంది. కానీ అమ్మడు పలు చిత్రాలతో బిజీగా ఉంది. దాంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నరని టాక్. అందులో నిధి అగర్వాల్ కూడా ఉందట. 
 
కానీ నిధి అగర్వాల్ లీడ్ రోల్ కి కాదు సెకండ్ లీడ్ కోసం అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అదే నిజమైతే నిధి కెరీర్ కి చక్కటి బ్రేక్ లభించినట్లే. మరి ఏం జరుగుతుందో చూద్దాం.. 
తర్వాతి కథనం
మాట‌, పాట‌, నాట‌కంలో సిద్ధ‌హ‌స్తుడు పింగ‌ళి