గురువారం, 5 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 జూన్ 2025 (18:07 IST)

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

harihara veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం హరిహర వీరమల్లు మళ్లీ వాయిదాపడినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దానికి కారణం సిజీ వర్క్ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. సిజీ వర్క్ పూర్తికావడమానికి మరికొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 12వ తేదీన కాకుండా వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, నిర్మాత ఏ.ఎం.రత్నం మంగళవారమే ఫిలిం ఛాంబర్‌కు.. టిక్కెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనల నిమిత్తం అర్జీని కూడా పెట్టుకున్నారు. దీంతో అభిమానులకు ఏది నిజమో, అబద్దమో నమ్మలేని పరిస్దితి. అయితే హరిహర వీరమల్లు సినిమాకు ఎలాంటి ధియేటర్స్ బ్లాక్ చేయ్యెద్దని నిర్మాత ఇప్పటికే చెప్పినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తొంది.
 
అది పక్కన పెడితే జూన్ 12 కాకుంటే మరో డేట్ ఎప్పుడు అనే డిస్కషన్ మొదలైంది. జూన్ 20 , దానికంటే  జూన్ 27తేదీని రిలీజ్ చేయాలని  మేకర్స్ పరిశీలిస్తున్నారట. అందుకోసం మంచు విష్ణుని కూడా జూన్ 27 డేట్ తమకు కావాలని .. కన్నప్ప సినిమాను వాయిదా వేసుకుంటారా అని కోరినట్లు.. విష్ణు అందుకు  ఒప్పుకోలేదని టాక్. జూన్ మిస్ అయితే ఇక  జూలైలోనే హరిహర వీరమల్లు ఉండొచ్చు. అప్పుడు ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో చూడాలి. కాగా జరుగుతోన్న రకరకాల ప్రచారం  పుల్ స్టాప్ పెట్టడానికి.. హరిహర వీరమల్లు విడుదల పై మేకర్స్ నుంచే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.