1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ravi Teja begins dubbing for Irumudi – second single coming soon

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

Ravi Teja, Priya Bhavani Shankar
Ravi Teja, Priya Bhavani Shankar
తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ స్టూడియో వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. వీడియోలో "నాకు ఒకే ఒక్క కూతురే... పేరు మనమ్మ" అంటూ రవితేజ ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో తండ్రి-కూతురు మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారనే ఆసక్తిని మరింత పెంచారు. ఈ వీడియోలో బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించారు.
 
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, కేవలం మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా  జరుగుతున్నాయి. దీంతో సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
 
ఇప్పటికే తన మనసుని తాకే సంగీతంతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ రీ-రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించారు. అలాగే సినిమా నుంచి రెండో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 
ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్‌లోనే అత్యంత ఎమోషనల్, ఇంటెన్సిటీ గల తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర వారి కుమార్తె పాత్రను పోషిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.
 
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు