ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (16:44 IST)

అలిపిరికి అల్లంత దూరంలో విడుదలకు సిద్ధం

Ravan Nittoor, Sri Nikita
Ravan Nittoor, Sri Nikita
కాస్కేడ్ పిక్చర్స్ పతాకం పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  అలాగే 'మా తిరుపతి' పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయిది. నవంబర్ 18న ఈ చిత్రం థియేటర్లో విడుదలౌతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు రూపొందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. వింటేజ్ డేస్ ని గుర్తుకు తెస్తూ దండోరా వేయించడం అలరిస్తోంది.
 
తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్ధమౌతుంది.  
 
నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా, డిజికె డీవోపీగా పని చేస్తున్నారు.