సంబంధిత వార్తలు
- మహేష్‌బాబు హీరోయిన్‌పై కాలు వేయడం తల్లి దగ్గర నిద్రపోయే బిడ్డలా వుంది - దర్శకుడు పరశురాం
- 2జీ కాలంలో దేశం ఓ దశాబ్దం వెనకబడింది... 6జీ సేవలు వచ్చేస్తున్నాయ్!
- నన్ను పొలిటికల్ లీడర్‌గా క్రియేట్ చేయబోతున్నది వై.ఎస్. జగన్‌గారే - అలీ
- హీట్‌వేవ్: ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోవచ్చు- వాతావరణ విభాగం హెచ్చరిక
- చేతనా రాజ్: బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స తరువాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
సత్యదేవ్ చిత్రం గాడ్సే రిలీజ్ డేట్ ఖరారు
Satyadev
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం గాడ్సే. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో బ్లఫ్ మాస్టర్ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ లెవల్లో సి.కె.స్క్రీన్స్ బ్యానర్‌పై విడుదల చేయబోతున్నట్లు నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయటంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా గోపి గణేష్ అందిస్తున్నారు.
అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ ,సిజ్జూ మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తర్వాతి కథనం
