త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్
Vashishta N Simha, Sanchi Roy
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ పెంచగా.. తాజాగా నీవల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘురాం అందించిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ సింగింగ్ మేజర్ హైలైట్ అయ్యాయి. సాంగ్ లో కనిపిస్తున్న సీన్స్ యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ చిత్రానికి ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన మ్యూజిక్-ఆర్ఆర్, కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.
తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర

