1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. small producers are Support for Vishnu

విష్ణుకు చిన్న నిర్మాత‌ల మ‌ద్ద‌తు

Movie Arists Association
Manchu Vishnu, P. Satyareddy, Mohan Babu, EVN Chari
ఈనెల 10న మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ (మా)కు జరగబోతున్న ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణుకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు నటుడు, దర్శక, నిర్మాత అయిన పి.సత్యారెడ్డి. ఆయ‌న సారథ్యంలోని పాతికమందితో కూడిన నిర్మాతల బృందం మ‌ద్ద‌తు తెలిపింది. యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యోన్ముఖుడైన మంచు విష్ణు నేత్రుత్వంలో `మా` అసోసియేషన్ పలు సంక్షేమ పధకాలతో అభివృద్ధి పధంలో పయనిస్తుందని అందుకే విష్ణుకు తమ మద్దతు తెలియజేస్తున్నామని పి. సత్యారెడ్డి తో పాటు మిగతా నిర్మాతల బృందం తెలిపింది. 
 
ఈ మేరకు ఆ బృందం గురువారం హైదరాబాద్ లోని విష్ణు కార్యాలయానికి వెళ్లి విష్ణుని కలిసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. కాగా మద్దతు పలికిన నిర్మాతల బృందంలో ఎస్.వి.రావు, ఇ.వి.ఎన్. చారి, ఈశ్వర్, అమర్, సతీష్ రెడ్డి, వర్మ, తిరుమల, నారాయణరెడ్డి, జీ కే రెడ్డి తదితరులు ఉన్నారు.
About Writer
ముర‌ళీకృష్ణ‌
తర్వాతి కథనం
ఎన్‌.టి.ఆర్‌. షోకూ స‌మంత‌! ఏం చెబుతుందోన‌ని ఆస‌క్తి!