ప్రతి మనిషి రెండు సార్లు చనిపోతాడట, అందుకే స్పార్క్ చేశా : హీరో విక్రాంత్
Vikrant, Mehreen
హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ స్పార్క్ మూవీ టైటిల్ తగ్గట్టే స్పార్క్‌లా ఉంటుంది. విక్రాంత్, గురు సోమసుందరం ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించబోతున్నారు. మా నిర్మాత లీలగారికి థాంక్స్. ఆమె మంచి సపోర్ట్‌తో మంచి సినిమాను చేశాం. అది ఇప్పుడు స్క్రీన్‌పై ట్రైలర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. నవంబర్ 17న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ స్పార్క్ మూవీ నా మూడేళ్ల కల. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నేను మూడేళ్ల ముందు యు.ఎస్‌లో ట్రైన్లో వెళుతుండగా ఓ విషయాన్ని చదివాను. ప్రతి మనిషి రెండు సార్లు చనిపోతాడట. ముందుగా కలలు కనటం, వాటిని నేరవేర్చుకోలేకపోతే చనిపోతాడు. మరోసారి భౌతికంగా చనిపోతాడు అని అందులో రాసి ఉంది. అది చదవగానే ఉద్యోగం, సంపాదనలో పడి నేను కలలు కనటాన్ని మరచిపోయానని అనిపించింది. నేను ఒక సినిమా పిచ్చోడ్ని. కాబట్టి.. సినిమా చేయాలని భావించాను. అనుకున్నట్లుగానే ఏడాదిన్నర పాటు కష్టపడి స్పార్క్ మూవీ కథను రాసుకున్నాను. మరో ఏడాదిన్నర పాటు కష్టపడి సినిమాను నిర్మించాం. మూవీ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక మల్టీ జోనర్ మూవీ. ఇందులో యాక్షన్ ఉంది, లవ్ స్టోరి ఉంది. థ్రిల్లర్ సినిమా కూడా. కామెడీ ఉంది, డ్రామా కూడా ఉంది. యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్లో మల్టీపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నాం. నేను హీరోగా నటించాను. తర్వాత మెహరీన్ గురించి చెప్పాలి. ఇప్పటికే చాలా పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు స్పార్క్ మూవీలో మరో విలక్షణమైన పాత్రలో అలరించనుంది. తన పాత్ర పేరు ఇందులో లేఖ. ఆమె కెరీర్లో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. రుక్సర్ థిల్లాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె కూడా విలక్షణమైన పాత్రలో అలరించింది. నవంబర్ 17న రిలీజ్ అవుతున్న సినిమాను చూసిన ప్రేక్షకులు మంచి మూవీ చూశామని ఫీల్ అవుతారు. మూవీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు.

